అక్షరటుడే, కామారెడ్డి: ఇంటింటి సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. శుక్రవారం కామారెడ్డి పట్టణంలోని వాసవీ హైస్కూల్ సమీపంలో ఇంటింటి సర్వేను పరిశీలించారు. ప్రతి ఇంట్లో సర్వే నిర్వహించాలని, కుటుంబంలోని ప్రతి ఒక్కరి సమాచారాన్ని సేకరించాలని తెలిపారు. సమాచారాన్ని సేకరించిన అనంతరం స్టిక్కర్ అంటించాలని చెప్పారు. కార్యక్రమంలో ఆర్డీవో రంగనాథ్ రావు, మున్సిపల్ ఛైర్ పర్సన్ ఇందుప్రియ, అధికారులు పాల్గొన్నారు.