అక్షరటుడే, కామారెడ్డి: బీజేపీ సభ్యత్వ నమోదులో తెలంగాణ ముందంజలో ఉందని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి అన్నారు. శనివారం ఆయన బీబీపేట మండల కార్యవర్గ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సెప్టెంబర్ 2న సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం కాగా.. రెండు నెలల్లో 11 కోట్ల మంది బీజేపీలో సభ్యులుగా చేరారని తెలిపారు. బీజేపీలో చేరేందుకు యువత, మహిళలు, వృద్దులు ఉత్సాహంగా ఉన్నారని పేర్కొన్నారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అన్ని రాష్ట్రాల్లో బీజేపీ సభ్యత్వం పెరిగిందన్నారు. కామారెడ్డి జిల్లాలో బీజేపీ సభ్యత్వం గతంతో పోలిస్తే రెట్టింపయ్యిందని తెలిపారు. అలాగే క్రియాశీల సభ్యులు కూడా గణనీయంగా పెరిగారని చెప్పారు.
Advertisement
Advertisement