డబ్ల్యూటీసీలో రెండోస్థానానికి పడిపోయిన భారత్‌

0

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌ : న్యూజిలాండ్‌తో టీమ్‌ ఇండియా 0-3 తేడాతో సిరీస్‌ ను కోల్పోయింది. దీంతో డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో టీమ్‌ ఇండియా రెండో స్థానానికి పడిపోయింది. ప్రస్తుతం ఆస్ట్రేలియా 62.50 శాతంలో తొలిస్థానంలో నిలిచింది. 58.33 శాతంలో భారత్‌ ద్వితీయ స్థానంలో కొనసాగుతుంది. శ్రీలంక 55.56 మూడో స్థానంలో, తాజాగా సిరీస్‌ నెగ్గిన కివీస్‌ 54.55 శాతంతో నాలుగో స్థానంలో, దక్షిణాఫ్రికా 54.17 శాతంతో ఐదు స్థానంలో కొనసాగుతోంది. బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫిలో భాగంగా టీమ్‌ ఇండియా ఆసీస్‌తో ఐదు టెస్టులు ఆడనుంది. ఈసిరీస్‌ భారత్‌కు కీలకంగా మారింది.