అక్షరటుడే, బాన్సువాడ: రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. మండలంలోని కొల్లూరు, నాగారం, దేశాయిపేట గ్రామాల్లో ఆదివారం ఆగ్రో ఇండస్ట్రీస్ ఛైర్మన్ కాసుల బాలరాజ్ తో కలిసి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ధాన్యాన్ని దళాలకు విక్రంచి మోసపోవద్దని, ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో విక్రయించి మద్దతు ధర పొందాలని సూచించారు. కార్యక్రమంలో నాయకులు మోహన్ నాయక్, కృష్ణారెడ్డి, శ్రీధర్, శ్రవణ్, నారాయణరెడ్డి, నరహరి తదితరులు పాల్గొన్నారు.