అక్షరటుడే, ఎల్లారెడ్డి : నియోజకవర్గంలోని ప్రతి మండల కేంద్రంలో చేపల మార్కెట్ ఏర్పాటు చేస్తానని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు పేర్కొన్నారు. తాడ్వాయి శబరిమాత చెరువులో ఆదివారం ప్రభుత్వం వందశాతం రాయితీపై అందజేసిన చేప పిల్లలను విడుదల చేశారు. అనంతరం మినీ స్టేడియం పనులను పరిశీలించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, మత్స్యశాఖ అధికారులు పాల్గొన్నారు.