అక్షరటుడే, జుక్కల్: కామారెడ్డి జిల్లాకు చెందిన సివిల్ పోలీసులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. 2009లో సివిల్ కానిస్టేబుల్ గా ఎంపికైన వీరు.. 15 సంవత్సరాల విధులు పూర్తి చేసుకున్న సందర్భంగా నిజాంసాగర్ నీటిపారుదల శాఖ అతిథి గృహం వద్ద కలుసుకున్నారు. తమ అనుభవాలను పంచుకున్నారు. విధి నిర్వహణలో ఛేదించిన కేసుల వివరాలు, పేరు ప్రఖ్యాతలు సాధించుకున్న తీరును పంచుకుంటూ.. ఉదయం నుంచి సాయంత్రం వరకు సంతోషంగా గడిపారు. ప్రకృతి ఒడిలో సహపంక్తి భోజనాలు చేశారు.