అక్షరటుడే, కామారెడ్డి : టోల్ ఫ్రీ 15100 ద్వారా ఉచిత న్యాయసేవ పొందవచ్చని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి నాగరాణి అన్నారు. సోమవారం 15100 టోల్ ఫ్రీ నంబర్ వాల్ పోస్టర్లను కామారెడ్డి కోర్ట్ లైసన్ అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతి పోలీస్ స్టేషన్లో ఈ వాల్ పోస్టర్లను ఉంచి విస్తృత ప్రచారం కల్పించాలన్నారు. కార్యక్రమంలో కోర్ట్ లైసన్ అధికారులు మురళి, రామేశ్వర్ రెడ్డి, సీనియర్ సివిల్ జడ్జి కోర్ట్ సీనియర్ సూపరింటెండెంట్ భుజంగ రావు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సూపరింటెండెంట్ చంద్రసేన్ రెడ్డి, జూనియర్ అసిస్టెంట్ ఖాన్, సిబ్బంది పాల్గొన్నారు.