అక్షరటుడే, ఎల్లారెడ్డి: వరి ధాన్యం సేకరణను వేగవంతం చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. మంగళవారం లింగంపేట్, మెంగారం, నాగిరెడ్డి పేట్ మండలం తాండూర్ లో వరి ధాన్యం కేంద్రాలను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కొనుగోలు కేంద్రానికి వచ్చిన ధాన్యాన్ని పరిశీలించి కాంటా వేయాలన్నారు. బస్తాల్లో నింపిన ధాన్యాన్ని సంబంధిత రైస్ మిల్లులకు తరలించాలని సూచించారు. రైతులకు సంబంధించిన వరి ధాన్యం సేకరణ, బ్యాంకు ఖాతా, తదితర వివరాలను ట్యాబ్ లో నమోదు చేయాలన్నారు. రైతులకు రెండు, మూడు రోజుల్లో చెల్లింపులు జరిగేవిధంగా చూడాలని చెప్పారు. ఆయన వెంట ఆర్డీవో ప్రభాకర్, డీఆర్డీవో సురేందర్, పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ రాజేందర్, డీఎస్ వో నరసింహ రావు, జిల్లా సహకార అధికారి రాం మోహన్ తదితరులున్నారు.