అక్షరటుడే, ఇందూరు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ నెల 6 నుంచి చేపట్టనున్న సమగ్ర కుటుంబ సర్వేకు జిల్లా అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఇప్పటికే ఉపాధ్యాయులు, ఆశా వర్కర్లకు, సిబ్బందికి శిక్షణ కూడా అందజేశారు. మంగళవారం డివిజన్ల వారీగా విధులు నిర్వహించే ఎన్యుమరేటర్లు, సూపర్ వైజర్ల తుది జాబితాను ప్రకటించారు. ఆర్మూర్ డివిజన్లో 946 మంది, బోధన్ డివిజన్లో 563 మంది, నిజామాబాద్ డివిజన్లో 758 మంది ఎన్యుమరేటర్లను నియమించారు. అలాగే ఆర్మూర్ లో 110, బోధన్ లో 72, నిజామాబాద్ లో 86 మంది సూపర్వైజర్లను నియమించారు. ఆర్మూర్, బోధన్, నిజామాబాద్, భీమ్ గల్ మున్సిపాలిటీల వారీగా కూడా సిబ్బందిని సిద్ధం చేశారు.