అక్షరటుడే ఇందూరు: ఎస్జీఎఫ్ జాతీయస్థాయి తైక్వాండో పోటీలోనూ జిల్లా క్రీడాకారిణి ప్రతిభను చాటి ఇందూరు పేరు నిలబెట్టాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా ఆకాంక్షించారు. ఇటీవల వికారాబాద్ లో జరిగిన రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీల్లో బంగారు పతకం సాధించిన సాయి ప్రసన్నను బుధవారం ఎమ్మెల్యే అభినందించారు. ఈనెల 7 నుంచి 12వ తేదీ వరకు మధ్యప్రదేశ్ లో జరగనున్న జాతీయస్థాయి పోటీల్లో పాల్గొననుంది. కార్యక్రమంలో కోచ్ మనోజ్, తండ్రి గంగాధర్ పాల్గొన్నారు.