అక్షరటుడే, జుక్కల్ : పిట్లం మండలంలోని కుర్తి గ్రామంలో కొనుగోలు కేంద్రం వద్ద బుధవారం రైతులు నిరసన తెలిపారు. కాంటాలు మందకోడిగా సాగుతున్నాయని, కేంద్రాల్లో కనీస వసతులు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోళ్లలో వేగం పెంచాలని కోరారు. మిల్లర్లు అదనంగా తరుగు తీయకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సన్న రకం వడ్లకు మద్దతు ధరతో పాటు రూ.500 బోనస్ కలిపి వెంటనే రైతుల ఖాతాలలో జమ చేయాలని కోరారు.