అక్షరటుడే, కామారెడ్డి : సైబర్ నేరాలపై జాగ్రత్త వహించాలని సైబర్ క్రైమ్ డీఎస్పీ శ్రావణ్ కుమార్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో సైబర్ జాగృత దివస్ సందర్భంగా నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నకిలీ పోలీసు కాల్స్, మ్యూల్ ఖాతాలు, మానవ అక్రమ రవాణా, ఏపీకే ఫైల్స్, బ్యాంకుల నుంచి నకిలీ కాల్స్ గురించి చెప్పారు. డిజిటల్ అరెస్టుల కుంభకోణాలు, స్టాక్ మార్కెట్ మోసాలు, డయల్ 1930 ప్రాముఖ్యత, గోల్డెన్అవర్ ప్రాముఖ్యత పై అవగాహన కల్పించారు.