అక్షరటుడే, ఇందూరు: అడ్డగోలుగా వడ్డీలు వసూలు చేస్తూ కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్న వడ్డీ వ్యాపారులను కఠినంగా శిక్షించాలని ఆర్యవైశ్య సంఘం నాయకులు డిమాండ్‌ చేశారు. వడ్డీ వ్యాపారుల వేధింపులకు పాల్పడిన ఘటన కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా గురువారం ఆర్యవైశ్య సంఘం సభ్యులు బాధితురాలి ఇంటికి వెళ్లి మద్దతు ప్రకటించారు. వడ్డీ వ్యాపారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.