అక్షరటుడే, కోటగిరి: కోటగిరి మండలం కొత్తపల్లి క్యాంపులో కుటుంబ సర్వేను జెడ్పీ సీఈవో ఉష గురువారం పరిశీలించారు. సర్వేకు వచ్చిన అధికారులకు ప్రజలు సహకరించాలని కోరారు. సర్వే పక్కాగా చేపట్టాలని సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ గంగాధర్, ఎంపీడీవో శ్రీనివాస్ రెడ్డి, ఎంపీవో చందర్, ఇరిగేషన్ ఏఈ సత్యనారాయణ, గ్రామ పంచాయతీ కార్యదర్శి స్వప్న ఉన్నారు.