అక్షరటుడే, జుక్కల్ : నిజాంసాగర్ ప్రాజెక్ట్ పర్యాటక అభివృద్ధి వైపు అడుగులు పడుతున్నాయి. ఇందులో భాగంగా నిజాంసాగర్ మండలం అచ్చంపేట గోల్ బంగ్లా ప్రాంతంలో ఉన్న 12.5 ఎకరాల రెవెన్యూ భూమిని టూరిజం శాఖకు కేటాయించారు. గురువారం తహసీల్దార్ భిక్షపతి, నీటిపారుదల శాఖ ఏఈ శివకుమార్, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ తదితరులు పర్యాటకశాఖ అధికారులకు భూమి పత్రాలను అప్పగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిజాంసాగర్ ను పర్యాటక కేంద్రంగా మారిస్తే మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. కార్యక్రమంలో నాయకులు లక్ష్మయ్య, బంగ్లా ప్రవీణ్ కుమార్, గాండ్ల రమేష్ పాల్గొన్నారు.