అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: గత రెండేళ్లలో అత్యంత కఠిన పరిస్థితులను ఎదుర్కొన్నామని ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేత అర్వింద్‌ కేజ్రీవాల్‌ అన్నారు. మమ్మల్ని ఇబ్బంది పెట్టేందుకు తీవ్ర ప్రయత్నాలు చేసినా పార్టీ విడిపోలేదని వ్యాఖ్యానించారు. ఆమ్‌ ఆద్మీ పార్టీ కార్యకర్తలంతా ఒక కుటుంబంలా కలిసి ఉన్నారన్నారు. మరికొద్ది రోజుల్లో రానున్న ఢల్లీి అసెంబ్లీ ఎన్నికల్లో మనల్ని ఓడిరచేందుకు కొన్ని శక్తులు తీవ్రంగా పనిచేస్తాయని.. వాటిని గెలవనివ్వకూడదని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్‌’లో వీడియో విడుదల చేశారు.