అక్షరటుడే, వెబ్‌డెస్క్‌ : యాదగిరి గుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో సీఎం రేవంత్‌రెడ్డి శుక్రవారం తన జన్మదినం సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు మంత్రులతో కలిసి ఆలయానికి విచ్చేసిన సీఎంకి ఆలయ ప్రధానార్చకులు, అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ముందుగా అఖండ దీపారాధనను దర్శించుకొని దీపం వెలిగించారు. అనంతరం ఆలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత ఆలయ అభివృద్ధిపై వైటీడీ అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు.

Advertisement
Advertisement
Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  CM Revanth Reddy | బీసీలు ధర్మయుద్ధం ప్రకటించాలి: సీఎం రేవంత్​