అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన ఎస్‌బీఐ రెండో త్రైమాసికంలో 28 శాతం లాభం నమోదు చేసింది. శుక్రవారం సంస్థ తన రిజల్ట్స్ ప్రకటించింది. జూలై- సెప్టెంబర్ క్వార్టర్‌లో బ్యాంకుకు రూ.18,331.4 కోట్ల లాభం వచ్చింది. జూన్ క్వార్టర్లో సంస్థకు రూ.17,035 కోట్ల లాభం నమోదైంది. గత త్రైమాసికంతో పోలిస్తే 8%, గతేడాది క్యూ-2 రిజల్ట్స్ తో పోలిస్తే 28 శాతం వృద్ధి నమోదు చేసింది. కాగా శుక్రవారం ఎస్‌బీఐ షేర్ రెండు శాతం పడిపోయింది.