అక్షరటుడే, కామారెడ్డి గ్రామీణం: రాష్ట్రస్థాయి అండర్-17 బాలికల హాకీ టోర్నీకి జడ్పీహెచ్ ఎస్ గర్గుల్ పాఠశాల క్రీడాకారులు రణబోయిన ప్రవళిక, కమ్మరి భవానీ ఎంపికైనట్లు పీడీ మధుసూదన్ రెడ్డి పేర్కొన్నారు. ఎంపికైన క్రీడాకారులు ఈనెల 11వ తేదీ నుంచి 13 వరకు నిజామాబాద్ లోని నవ్యభారతి గ్లోబల్ హైస్కూల్ లో జరిగే టోర్నీలో పాల్గొంటారన్నారు. క్రీడాకారులను పాఠశాల ఇంఛార్జి హెచ్ఎం బ్రహ్మం, టీచర్లు అభినందించారు.