అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: ఎవరు అడ్డం వచ్చినా బుల్డోజర్లు ఎక్కించి మూసీ ప్రక్షాళన చేసి తీరుతామని సీఎం రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. “ఈరోజు నా జన్మదినం కాదు జన్మధన్యమైన రోజు” అని రేవంత్ పేర్కొన్నారు. శుక్రవారం సంగెం-భీమలింగం-ధర్మారెడ్డిపల్లి కెనాల్‌ నుంచి నాగిరెడ్డిపల్లి వరకు సీఎం రేవంత్‌ రెడ్డి మూసీ పునరుజ్జీవ సంకల్ప పాదయాత్ర కొనసాగింది. అనంతరం సంగెం వద్ద నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడారు. మూసీ నది కాలుష్యం అణుబాంబులా మారబోతుందన్నారు. వరంగా మారాల్సిన మూసీ నది పరివాహక ప్రాంత ప్రజలకు శాపంగా మారిందన్నారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్లు దోచుకున్నారని మండిపడ్డారు. ప్రజలు ఇస్తే ఈ పదవి వచ్చిందని, ఎవరి దయదాక్షిణ్యల మీద రాలేదన్నారు.