అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: సీప్లేన్‌ సేవల కోసం గైడ్‌లైన్స్‌లో మార్పులు చేశామని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌ నాయుడు పేర్కొన్నారు. శనివారం విజయవాడలో సీఎం చంద్రబాబుతో కలిసి విజయవాడ – శ్రీశైలం సీప్లేన్‌ సేవలను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఏపీలో సరికొత్త అధ్యాయం ప్రారంభమైందన్నారు. విజయవాడ పున్నమి ఘూట్‌ నుంచి బయలుదేరిన సీప్లేన్‌ శ్రీశైలం పాతాళగంగలో సురక్షితంగా ల్యాండ్‌ అయింది. ఇందులో సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి రామ్మోహన్‌ నాయుడు ప్రయాణించారు. అనంతరం వారు శ్రీశైల మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు.