అక్షరటుడే, ఆర్మూర్ : బాల్కొండ అంబేద్కర్ యువజన సంఘం కార్యవర్గాన్ని శనివారం ఎన్నుకున్నారు. సంఘం జిల్లా అధ్యక్షుడు ఇత్వార్పేట్ లింగన్న ఆధ్వర్యంలో బాల్కొండ మండల కేంద్రంలోని ఫంక్షన్ హాల్‌లో కార్యక్రమం నిర్వహించారు. బాల్కొండ నియోజకవర్గ బాధ్యుడిగా జిన్నా జనార్ధన్, మండలాధ్యక్షుడిగా దేవతి రవికి నియామకపత్రాన్ని అందజేశారు. కార్యవర్గంలో జిల్లా ఉపాధ్యక్షుడు గైని సంజీవ్, థామస్, జయరాజ్ తదితరులున్నారు.