అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: తెలంగాణలో రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని కేంద్రమంత్రి బండి సంజయ్‌ అన్నారు. అర్హులకు కూడా రుణమాఫీ కాలేదన్నారు. కమీషన్ల కోసం పేదల ఇళ్లు కూలిస్తే ఊరుకోబోమన్నారు. మూసీ ప్రక్షాళనకు తాము వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. బోనస్ డబ్బులు ఇవ్వకుండా తప్పించుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆరోపించారు.