అక్షరటుడే, ఇందూరు: ఐకమత్యానికి మారుపేరుగా మేరు సంఘం నిలుస్తుందని ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ పేర్కొన్నారు. ఆదివారం నగరంలోని మేరు సంఘంలో సంఘ భవనం పునః ప్రారంభోత్సవం, వివిధ తర్పల కార్యవర్గ ప్రమాణస్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు. సంఘ సభ్యులంతా ఐకమత్యంతో భవనాన్ని నిర్మించుకోవడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో స్థానిక కార్పోరేటర్ గడుగు రోహిత్, సంఘం జిల్లా అధ్యక్షుడు సోమ హనుమంత్ రావు, మాజీ జిల్లా అధ్యక్షుడు గంగ కిషన్, కొట్టురు దేవిదాస్ తదితరులున్నారు.
Advertisement
Advertisement