ఎదుర్కోలు ఉత్సవానికి ముస్తాబు

Advertisement

అక్షర టుడే, ఆర్మూర్ : భీమ్ గల్ లోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. నాలుగో రోజు ఆదివారం శ్రీవారి కల్యాణ ఎదురుకోలుకు లక్ష్మీ సమేత నరసింహ స్వామి వారిని ఆలయ అర్చకులు ముస్తాబు చేశారు. స్వామివారిని అశ్వ వాహనంపై అలంకరించగా, అమ్మవారిని బంగారు ఆభరణాలతో అందంగా అలంకరించారు. సోమవారం కల్యాణోత్సవం నిర్వహించనున్నారు.

Advertisement
ఇది కూడా చ‌ద‌వండి :  BHEEMGAL | విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు