అక్షరటుడే, నిజమాబాద్ సిటీ: నగరంలోని రాధాకృష్ణ విద్యాలయం(ఆర్యసమాజ్) పాఠశాల 1990 బ్యాచ్ ఏడో తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ఘనంగా జరిగింది. విద్యార్థులు ఆనాటి జ్ఞాపకాలను నెమరవేసుకుంటూ ఆనందంగా గడిపారు. నాటి ఉపాధ్యాయులు నాగయ్య , సమత , హైమావతిని ఘనంగా సన్మానించారు. విద్యార్థులు ప్రవీణ్ కుమార్, రాజు ,అజయ్, రజిని, సునీత, జమున, ఎన్నారై ప్రవీణ్, గోల్డ్ శ్రీనివాస్, కృష్ణమూర్తి పాల్గొన్నారు.