అక్షరటుడే, ఇందూరు: జీవో 317 బాధితులందరికీ న్యాయం చేయాలని టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు వెనిగళ్ల సురేష్ డిమాండ్ చేశారు. నగరంలోని ధర్నా చౌక్ లో కొనసాగుతున్న దీక్షకు మద్దతు పలికి మాట్లాడారు. ప్రభుత్వం సమస్యను పరిష్కారం చేయాలని అన్నారు. సొంత జిల్లాలోనే ఉద్యోగాలు కల్పించాలని కోరారు.