అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: నిజామాబాద్ నగరానికి చెందిన సీనియర్ న్యాయవాది తారాచంద్ చౌదరి మృతి చెందడంతో నిజామాబాద్ బార్ అసోసియేషన్ సభ్యులు సోమవారం సంతాపం తెలిపారు. అసోసియేషన్ అధ్యక్షుడు జగన్ మోహన్ గౌడ్ మాట్లాడుతూ.. తారాచంద్ మృతి న్యాయవాద సమాజానికి తీరని లోటని పేర్కొన్నారు. సంతాప సూచనగా సోమవారం విధులకు దూరంగా ఉండాలని తీర్మానించారు. వసంత్ రావు, పిండం రాజు, దొంపాల్ సురేష్, జయప్రకాష్, నారాయణ, మానిక్ రాజ్, బాలాజీ, యూనిస్ ఖాన్, యెర్రం విఘ్నేష్ నాగేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు.