అక్షరటుడే, కామారెడ్డి: ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ లోని మినీ సమావేశ మందిరంలో పౌరసరఫరాలు, మార్కెటింగ్, తదితర అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో కొనుగోలు చేసిన ధాన్యాన్ని సంబంధిత రైస్ మిల్లులకు తరలించాలని, ట్యాబ్ ఎంట్రీలు త్వరగా చేయాలని తెలిపారు. రైతులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా కొనుగోలు చేసిన ధాన్యానికి త్వరగా చెల్లింపులు జరిగేలా చూడాలన్నారు. టార్పాలిన్, గోనె సంచులు ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. ధాన్యం కొనుగోళ్లు విషయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూంకు వచ్చిన ఫిర్యాదులపై చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ విక్టర్, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ రాజేందర్, ఇన్ ఛార్జి జిల్లా పౌర సరఫరాల అధికారి నరసింహరావు, జిల్లా సహకార అధికారి రాంమోహన్, డీపీఎం రమేశ్ బాబు తదితరులు పాల్గొన్నారు.