అక్షర టుడే, ఆర్మూర్ : పట్టణంలోని 19,20 వార్డుల్లో సోమవారం సమగ్ర సర్వే చేపట్టగా, మున్సిపల్ కమిషనర్ రాజు పరిశీలించారు. ఈ సందర్భంగా సర్వే వివరాలు అడిగి తెలుసుకున్నారు. పక్కాగా చేపట్టాలని ఎన్యూమరేటర్లకు సలహాలు, సూచనలు చేశారు. ఆయన వెంట సూపర్వైజర్లు బాలరాజ్, కృష్ణయ్య, ఎన్యుమరేటర్లు ఉన్నారు.