అక్షరటుడే, ఇందూరు : ప్రతిఉద్యోగి టీఎన్జీవోస్ లో సభ్యత్వం తీసుకోవాలని అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు సుమన్‌ పేర్కొన్నారు. కలెక్టరేట్‌లో సోమవారం విద్యాశాఖ, ట్రెజరీ శాఖ, రెవెన్యూ శాఖల్లో టీఎన్జీవో సభ్యత్వంపై అవగాహన కల్పించారు. పలువురికి సభ్యత్వం రశీదులను అందజేశారు. కార్యక్రమంలో టీఎన్జీవోస్ జిల్లా కార్యదర్శి నేతికుంట శేఖర్‌, సహాధ్యక్షుడు చిట్టి నారాయణ రెడ్డి, కేంద్ర కార్యదర్శి పోల శ్రీనివాస్‌, కోశాధికారి దినేష్‌ బాబు, జిల్లా కార్యవర్గ సభ్యులు జాఫర్‌ హుస్సేన్‌, జాకీర్‌ హుస్సేన్‌, ఉమాకిరణ్‌, గురు చరణ్‌ తదితరులు పాల్గొన్నారు.