అక్షరటుడే, వెబ్ డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు(మంగళవారం) ఉదయం హైదరాబాద్ నుంచి ఆయన ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. అక్కడ ఏఐసీసీ పెద్దలతో ఆయన సమావేశం కానున్నారు. రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలను వారికి రేవంత్ వివరించనున్నట్లు సమాచారం. త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో చాలామంది ఆశావహులు ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో ఈ అంశంపైనా చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అయితే మాజీ మంత్రి కేటీఆర్ ఢిల్లీ వెళ్లిన మరుసటిరోజే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హస్తిన బాట పట్టడంపై రాష్ట్రంలో తీవ్ర చర్చ జరుగుతోంది. ఇక ఏఐసీసీ ముఖ్య నేతలతో భేటీ అనంతరం అక్కడి నుంచి మహారాష్ట్రకు వెళ్లే అవకాశం ఉందని పార్టీ నేతలు చెబుతున్నారు. అక్కడ జరిగనున్న ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ తరఫున ప్రచారం చేయనున్నారు.