అక్షరటుడే, ఇందూరు: జిల్లాలో త్వరలో అన్ని హంగులతో స్పోర్ట్స్ స్టేడియం నిర్మిస్తామని రాష్ట్ర ఉర్దూ అకాడమీ ఛైర్మన్ తాహెర్ బిన్ హందాన్ తెలిపారు. నగరంలోని ఎన్జీఎస్ స్కూల్ గ్రౌండ్ లో బుధవారం నిర్వహించిన రాష్ట్రస్థాయి హాకీ టోర్నీ ముగింపు సమావేశంలో ఆయన మాట్లాడారు. జాతీయస్థాయిలోనూ ప్రతిభను చాటి జిల్లా పేరును నిలబెట్టాలని ఆకాంక్షించారు. అనంతరం రాష్ట్ర వ్యవసాయ కమిషన్ మెంబర్ గడుగు గంగాధర్ మాట్లాడుతూ.. క్రీడలతో శారీరక మానసిక ఉల్లాసం కలుగుతుందన్నారు. చదువుతోపాటు క్రీడలు ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎస్జీఎఫ్ కార్యదర్శి నాగమణి, పీడీలు రవికుమార్, స్వామి, కార్యనిర్వాహక కార్యదర్శి గోపిరెడ్డి, పేట సంఘం అధ్యక్షుడు విద్యాసాగర్ రెడ్డి, పీఈటీలు శ్రీనివాస్, వెంకట్, స్వామి తదితరులు పాల్గొన్నారు.

విజేత జిల్లా జట్టు..

ఎస్జీఎఫ్ అండర్-17 బాలికల టోర్నీలో విజేతగా జిల్లా జట్టు నిలిచింది. ఫైనల్ లో మహబూబ్ నగర్ జట్టుపై 2-0 తేడాతో నిజామాబాద్ గెలుపొందింది. ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను ఆయా జిల్లాల నుంచి ఎంపిక చేశారు. తొందర్లో హర్యానాలో జరిగే జాతీయస్థాయి పోటీలో పాల్గొన్నారు.