అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో సంచన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మునుగోడు ఉప ఎన్నికల సమయంలో మాజీ ఎమ్మెల్యే లింగయ్య రెండు నంబర్లను ట్యాప్ చేయించినట్లు తెలుస్తోంది. డీఎస్పీ తిరుపతన్నతో ఆయన ఫోన్‌లో సంభాషించినట్లు ఆధారాలు ఉన్నట్లు సమాచారం. ఆధారాలు బయటపడడంతో లింగయ్యను పోలీసులు విచారణకు పిలిచారు. మరి కాసేపట్లో జూబ్లీహిల్స్‌ పోలీసులు విచారించనున్నట్లు తెలుస్తోంది.