అక్షరటుడే, నిజామాబాద్ రూరల్: ఇందల్వాయి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో తిర్మన్‌పల్లి గిరిజన బాలికల పాఠశాల, కళాశాలలో బాలికలకు రక్తహీనతపై గురువారం అవగాహన కల్పించారు. మండల ఆరోగ్య విస్తరణ అధికారి శంకర్ మాట్లాడుతూ.. 220 మంది బాలికలకు హిమోగ్లోబిన్ పరీక్షలు చేశామన్నారు. కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ అక్బర్ అలీ, పాఠశాల ప్రధానోపాధ్యాయులు పద్మ, ఆరోగ్య సిబ్బంది, శారద, ఫార్మసిస్ట్ మౌనిక, సుమలత, స్రవంతి పాల్గొన్నారు.