Advertisement
అక్షరటుడే, ఇందూరు : నగరంలోని వీహెచ్పీ జిల్లా కార్యాలయంలో గురువారం ప్రఖండ కమిటీల ఎన్నిక నిర్వహించారు. ఈ సందర్భంగా కోటగల్లి, గాజుల్పేట్, వినాయక్ నగర్, ఎల్లమ్మ గుట్ట ప్రఖండలకు 50 మంది కమిటీ సభ్యులను ఎన్నుకోగా, వారు బాధ్యతలు స్వీకరించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు దినేష్ ఠాకూర్, కార్యదర్శి దయానంద్, ఉపాధ్యక్షుడు ఆనంద్, సహ కార్యదర్శి ధాత్రిక రమేష్, కోశాధికారి శేఖర్, నగర కార్యదర్శి రాంప్రసాద్, భజరంగ్ దళ్ నాయకులు అఖిల్, సురేష్, మహేష్, తదితరులు పాల్గొన్నారు.
Advertisement