అక్షరటుడే, వెబ్‌డెస్క్‌ : గాడిదల ఫామ్ ఏర్పాటు చేస్తే కోట్లు గడించొచ్చని యూట్యూబ్‌లో ప్రచారం చేసి కేటుగాళ్లు అమాయకులను నమ్మించారు. వారి మాట‌లు న‌మ్మి రూ.20 ల‌క్ష‌ల నుంచి రూ.90 ల‌క్ష‌ల వ‌ర‌కు బాధితులు పెట్టుబ‌డులు పెట్టారు. అధిక లాభం పొంద‌వ‌చ్చంటూ ప్రచారం చేసి.. మొదట లాభాల ఆశ చూపి, ఆ తర్వాత కేటుగాళ్లు మోసం చేశారు. గ‌తేడాది జూలై 23న త‌మిళ‌నాడులో ది డాంకీ ప్యాలెస్‌ను కేటుగాళ్లు ప్రారంభించారు. ఏపీ, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణల్లో 400 మందికి పైగా బాధితులు ఉన్నారు.