అక్షరటుడే, వెబ్‌డెస్క్ : ఏపీలోని పల్నాడు జిల్లా భావన కాలేజీ క్యాంపస్‌లో విద్యార్థినుల మధ్య పెన్ను కోసం గొడవ జరిగింది. దీంతో మనస్తాపం చెందిన అనుష అనే విద్యార్థిని శనివారం హస్టల్ భవనం నాలుగో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. బొల్లాపల్లి మండలం వెల్గటూరు అనుషది స్వగ్రామంకాగా, గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.