అక్షరటుడే, వెబ్‌డెస్క్: మహారాష్ట్రలో ప్రజాతీర్పును ఏక్‌నాథ్ షిండే, అజిత్ పవార్ కాలరాశారని.. వీరు గుజరాత్ గులాంలుగా మారారని సీఎం రేవంత్ విమర్శించారు. మహారాష్ట్రలోని చంద్రపూర్ నియోజకవర్గం గుగూస్ ప్రాంతంలో నిర్వహించిన ప్రచార సభలో ఆయన మాట్లాడారు. చంద్రాపూర్‌లో ఎమ్మెల్యే అభ్యర్థి ప్రవీణ్ పడ్‌వేకర్‌ను 50 వేల మెజారిటీలో గెలిపించాలని కోరారు. “ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రవీణ్‌ను గెలిపిస్తే మీకు ఇక్కడ ఒక అన్న ఉంటారు. హైదరాబాద్‌లో మరో అన్నగా నేను ఉంటా” అని వ్యాఖ్యనించారు. తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించామని, రూ.2 లక్షల రుణమాఫీ చేశామని పేర్కొన్నారు.
సీఎం రేవంత్ వాహనం తనిఖీ
చంద్రపూర్ నియోజకవర్గంలోని గుగూస్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు వెళ్తున్న క్రమంలో సీఎం రేవంత్ వాహనాన్ని మహారాష్ట్ర పోలీసులు తనిఖీ చేశారు. ఎన్నికల అధికారులు, పోలీసులు సీఎం రేవంత్ వాహనం ఆపి వాహనంలో బ్యాగులను క్షుణ్నంగా తనిఖీలు జరిపారు.