అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: దేశంలోనే తొలి ‘మహిళా’ బస్‌ డిపోను రాష్ట్ర రవాణాశాఖ మంత్రి కైలాశ్‌ గహ్లోత్‌ ఢిల్లీలో ప్రారంభించారు. ఢిల్లీలోని సరోజని నగర్‌లో పూర్తి స్థాయి మహిళా సిబ్బందితో కూడిన ఈ డిపోకు ‘సఖి డిపో’ అని పేరు పెట్టినట్లు పేర్కొన్నారు. ఇందులో డిపో మేనేజర్‌, డ్రైవర్లు, కండక్టర్లు, ఇలా సిబ్బంది అంతా మహిళలే. ఇందుకోసం 225 మందిని కేటాయించామని తెలిపారు. దేశంలో ఇదొక కొత్త ట్రెండ్‌ను సెట్‌ చేస్తుందన్నారు.
మహిళా ఉద్యోగుల నిరసన..
దేశంలోనే తొలి మహిళా బస్‌ డిపో ప్రారంభించడం మంచిదే అయినా రవాణా రంగంలో పనిచేస్తున్న తమకు సౌకర్యాలు లేవని మహిళా ఉద్యోగులు మంత్రి ఎదుట నిరసన వ్యక్తం చేశారు. మహిళా ఉద్యోగులతో మాట్లాడిన మంత్రి వారి డిమాండ్లు నెరవేర్చి, మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.