అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: నిజామాబాద్ ఆఫీసర్స్ క్లబ్ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి మాస్టర్ బ్యాడ్మింటన్ టోర్నీ కొనసాగుతోంది. ఆదివారం షటిల్ పోటీలను ఉర్దూ అకాడమీ ఛైర్మన్ తాహెర్ బిన్ హందాన్ ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారులు పోటీల్లో పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమంలో ఆఫీసర్స్ క్లబ్ సెక్రెటరీ చిల్వేరి సత్యనారాయణ, కేతావత్ వెంకట్ రాములు, గంగాకిషన్, మీసాల సుధాకర్, సంతోష్, అంగిరేకుల సాయిలు, అరవింద్, రవిరాజ్, సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement