అక్షరటుడే, జుక్కల్: కార్యకర్తలు అధైర్య పడవద్దని ఎల్లప్పుడూ తాము అండగా ఉంటామని జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ సింధే, జడ్పీ మాజీ ఛైర్మన్ దాఫెదర్ రాజు అన్నారు. ఆదివారం మహమ్మద్ నగర్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని వారు ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేయడం లేదన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కలిసికట్టుగా పని చేయాలని కార్యకర్తలకు సూచించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సాదుల సత్యనారాయణ, గంగారెడ్డి, వాజిద్ అలీ, సంగమేశ్వర్ గౌడ్, లింగాల రామచందర్, లక్ష్మీనారాయణ, నారాయణ, శ్రీనివాస్ పాల్గొన్నారు.