అక్షరటుడే, వెబ్‌డెస్క్: టీటీడీ పాలక మండలి సమావేశం ప్రారంభమైంది. ఛైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన ప్రారంభమైన ఈ సమావేశంలో 80 అంశాలపై చర్చించనున్నారు. గత పాలకమండలిలో తీసుకున్న నిర్ణయాలను నూతన ఛైర్మన్ సమీక్షించనున్నారు. క్యూలైన్లు, దర్శన విధానాలలో మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది. బోర్డు సభ్యులతో పాటు ఎమ్మెల్యేలకు దర్శన, సేవల కోటా పెంచుతూ ఈ సమావేశంలో నిర్ణయం తీసుకుంటారని సమాచారం. తిరుమలలో అన్యమత ప్రచారంపై తీసుకునే చర్యల గురించి చర్చించనున్నారు.