అక్షరటుడే, జుక్కల్ : పెద్దకొడప్గల్ మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో సోయా కొనుగోలు కేంద్రాన్ని సోమవారం ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం సోయా క్వింటాల్‌కు రూ.4,892 మద్దతు ధర ప్రకటించిందని తెలిపారు. సోయా రైతులు మార్కెట్ యార్డుకు తీసుకొచ్చి పంటను విక్రయించాలని సూచించారు. ఇంతకుముందు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ఎకరానికి 6 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేసేవారని.. తాను వ్యవసాయ మంత్రితో మాట్లాడటంతో దానిని 10 క్వింటాళ్లకు పెంచారని తెలిపారు.