అక్షరటుడే, బాన్సువాడ: మత్స్యకారుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని బాన్సువాడ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇందూరు చంద్రశేఖర్ అన్నారు. సోమవారం రుద్రూర్ గ్రామ చెరువులో 1.38 లక్షలు, రాణంపల్లి కొత్త చెరువులో 36 వేల చేప పిల్లలు విడుదల చేశారు. కార్యక్రమంలో మండలాధ్యక్షుడు తోట అరుణ్ కుమార్, గ్రామ అధ్యక్షుడు పార్వతి ప్రవీణ్, నాయకులు కర్క అశోక్, షేక్ నిస్సార్, పోతరాజ్ లింగం, సాయిలు, ఉరది నరేందర్, వడ్ల నరేశ్ తదితరులు పాల్గొన్నారు.