అక్షరటుడే, వెబ్డెస్క్: దేశీయ స్టాక్ మార్కెట్లో నష్టాలు కొనసాగుతున్నాయి. సోమవారం ఉదయం సెన్సెక్స్ 283 పాయింట్లు, నిఫ్టీ 73 పాయింట్ల లాభంతో ప్రారంభమైనా.. కొద్దిసేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి. ఇంట్రాడేలో ఒక దశలో సెన్సెక్స్ గరిష్టంగా 615 పాయింట్లు, నిఫ్టీ 182 పాయింట్లు పడిపోయాయి. ఆ తర్వాత కాస్త తేరుకుని మధ్యాహ్నం లాభాల్లోకి వచ్చినా అమ్మకాల ఒత్తిడితో మళ్లీ నష్టాల్లోకి జారుకున్నాయి. చివరికి సెన్సెక్స్ 241 పాయింట్ల నష్టంతో 77,339 పాయింట్ల వద్ద, నిఫ్టీ 79 పాయింట్ల నష్టంతో 23,453 పాయింట్ల వద్ద ముగిశాయి. హిందాల్కో, హీరో మోటార్, టాటా స్టీల్, ఎంఅండ్ఎం, హిందూస్తాన్ యూనీ లివర్, నెస్లే స్టాక్స్ లాభపడగా బీపీసీల్, టీసీఎస్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, ఎల్టీఐఎం, విప్రో, డాక్టర్ రెడ్డి, సిప్లా, అపోలో హాస్పిటల్స్, ఎన్టీపీసీ నష్టపోయాయి.