అక్షరటుడే, బాన్సువాడ: డ్వాక్రా సంఘాల్లో చేరాలనుకునే మహిళలను గుర్తించి సంఘాల్లో చేర్పించాలని మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు నాగమణి అన్నారు. ఇందిర మహిళా శక్తి సంబరాల్లో భాగంగా బీర్కూర్ మండల సమాఖ్య ప్రత్యేక సమావేశం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా బ్యాంకు లింకేజీ రుణాలు, ప్రమాద బీమా, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ, డ్వాక్రా బజార్ ఏర్పాటు, యూనిఫామ్ ల తయారీ, వడ్డీ లేని రుణాలు తదితర అంశాలపై చర్చించారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల వీవోలు పాల్గొన్నారు.