అక్షరటుడే, వెబ్ డెస్క్: భారత కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ గా సంజయ్ మూర్తిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నియమించారు. ఈయన ప్రస్తుతం ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిగా కొనసాగుతున్నారు. సంజయ్ మూర్తి 1989 ఐఏఎస్ బ్యాచ్ హిమాచల్ ప్రదేశ్ క్యాడర్ కు చెందినవారు. ప్రస్తుతం కాగ్ చీఫ్ గా ఉన్న గిరీష్ చంద్ర పదవీకాలం రేపటితో ముగియనుంది. ఆ తర్వాత సంజయ్ మూర్తి బాధ్యతలు చేపడతారు.