అక్షరటుడే, ఆర్మూర్: మెండోరా మండలం దూదిగాం గ్రామానికి చెందిన పలువురికి మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌ఛార్జి సునీల్ రెడ్డి ఆదేశాల మేరకు నాయకులు పంపిణీ చేశారు. గ్రామానికి చెందిన సరస్వతి, బొమ్మ వినోద్, కుంట మల్లేష్, కంచమ్మలకు చెక్కులు మంజూరు కాగా మంగళవారం అందజేశారు. కార్యక్రమంలో మండల ఇన్‌ఛార్జి నేల లింగన్న, మాజీ జెడ్పీటీసీ గంగాధర్, శ్రీనివాస్, రాజేందర్, పసుల శ్రీను, రఫీ, సాగర్, సుధాకర్ పాల్గొన్నారు.