అక్షరటుడే, వెబ్‌డెస్క్: చాలా రోజుల తర్వాత దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. మంగళవారం పాజిటివ్‌గా ప్రారంభమైన సూచీలు ఆ తర్వాత అదే జోరును కొనసాగిస్తున్నాయి. ఉదయం 209 పాయింట్ల గ్యాప్ అప్ తో ప్రారంభమైన సెన్సెక్స్.. ఇంట్రాడేలో గరిష్టంగా 966 పాయింట్లు లాభపడింది. నిఫ్టీ 76 పాయింట్ల లాభంతో మొదలై ఇంట్రాడేలో గరిష్టంగా 297 పాయింట్లు పెరిగింది. 11 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 78,265 పాయింట్ల వద్ద, నిఫ్టీ 23,732 పాయింట్ల వద్ద స్థిరంగా కదలాడుతున్నాయి. అదానీ పోర్ట్స్, అదానీ ఎంటర్ప్రైజెస్, టైటాన్, ఐచర్ మోటార్స్, ఎం అండ్ ఎం, హీరో మోటార్స్, టాటా మోటార్, బీపీసీల్, ఇండస్ ఇండ్ బ్యాంకు, టీసీఎస్, టెక్ మహీంద్రా, విప్రో, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, రిలయన్స్ లాభాల్లో కొనసాగుతుండగా హెచ్డీఎఫ్సీ లైఫ్, ఎస్బీఐ లైఫ్, హిందాల్కో, బజాజ్ ఫిన్ సర్వ్, ఐసీఐసీఐ బ్యాంకు స్టాక్స్ నష్టాల్లో ఉన్నాయి.